శ్రద్దా వాకర్ తరహా ఘటనలు: ఇద్దరు మహిళల శరీరాలను కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా నరికి

by Hamsa |
శ్రద్దా వాకర్ తరహా ఘటనలు: ఇద్దరు మహిళల శరీరాలను  కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా నరికి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఢిల్లీలో శ్రద్దా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా చంపేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించింది. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన భార్యను చంపి ముక్కలుగా చేస్తే, మరో యువకుడు మేనత్తను ముక్కలుగా చేశాడు.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో రాష్టంలో అనూజ్ శర్మ అనే యువకుడు మేనత్త సరోజ్ శర్మ ఇంట్లో ఉంటున్నాడు. అయితే అతనికి ఆమెకు ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. అయితే అనూజ్ ఢిల్లీకి వెళ్తానని సరోజ్‌కు చెప్పగా దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అనూజ్ ఆమెను సుత్తితో కొట్టి చంపి కటర్‌తో 10 ముక్కలు చేశాడు. ఒక బకెట్‌లో శరీర భాగాలను తీసుకెళ్లి అడవిలో పడేశాడు. ఒకరోజు సరోజ్ కూతురు ఇళ్లు శుభ్రం చేస్తుండగా అనూజ్ రూమ్‌లో రక్తం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్‌లో సాహెబ్, రుబికా అనే దంపతులు జీవిస్తున్నారు. అయితే రుబికా కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలిస్తున్న పోలీసులకు మోమిన్ ప్రాంతంలో ఓ ఇంట్లో రుబికా శరీర భాగాలు కనిపించాయి. దీంతో ఆమె భర్త పై అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రుబికాను తానే చంపేసి ఎలక్ట్రిక్ కట్టర్‌తో 12 ముక్కలుగా చేసి ఆ భవనంలో పడేసినట్లు తెలిపాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story