రూ.1600 కోసం కాల్పులు.. 33 ఏళ్లుగా ట్రీట్‌మెంట్ పొందుతూ పోలీస్ మృతి

by sudharani |
రూ.1600 కోసం కాల్పులు.. 33 ఏళ్లుగా ట్రీట్‌మెంట్ పొందుతూ పోలీస్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని సార్లు మనం ఎలాంటి తప్పు చేయకున్నా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 33 ఏళ్ల క్రితం జరిగిన కాల్పుల్లో గాయపడిన ఓ పోలీస్ అధికారి.. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ పొందుతూ నిన్న మృతి చెందాడు. 1990లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

1990 జనవరి 16న న్యూయార్క్‌కు చెందిన ప్యాటర్స్ అనే వ్యక్తి పోలీస్‌గా విధులు నిర్వర్తించే వాడు. అతడు తన ఇంటి బయట కారును శుభ్రం చేస్తుండగా.. అక్కడికి వచ్చిన ముగ్గురు దుండగులు 20 డాలర్లు (రూ. 1600) కావాలని ప్యాటర్స్‌ను బెదిరించారు. డబ్బులు ఇచ్చేందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో క్షణికావేశంలో దుండుగుల్లో ఓ 15 ఏళ్ల కుర్రాడు ప్యాటర్స్‌పై కాల్పుడు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే ప్యాటర్స్ బతికారు కానీ.. అప్పటి నుంచి ఆయన అచేతన స్థితిలోనే ఉన్నాడు. ఎప్పటికైనా కోలుకుంటారనే నమ్మకంతో కుటుంబసభ్యులు అప్పటి నుంచి ప్యాటర్స్‌కు ట్రీట్ మెంట్ ఇప్పిస్తూనే ఉన్నారు. కానీ.. నిన్న (సోమవారం) ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల న్యూయార్క్ పోలీసులు సంతాపం తెలియజేశారు. ఈ కేసులో విశేషం ఏంటంటే.. ప్యాటర్స్‌ను కాల్చిన దుండగులు శిక్ష అనుభవించి బయటకు కూడా రావడం. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరించారు.

Advertisement

Next Story

Most Viewed