- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమెరికాలో వరుస విమాన ప్రమాదలు.. మరోసారి రెండు విమానాలు ఢీ

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు (Flight accidents) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి రెండు విమానాలు (Two Flights) ఢీకొన్నాయి. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో మంగళవారం (భారత కాలమానం ప్రకారం) రెండు ప్రైవేట్ జెట్‌లు ఢీకొన్నాయి. రన్ వే 21పై బాంబార్డియర్ లియర్ జెట్ 35A ల్యాండ్ అవుతుండగా.. అదుపుతప్పి మరో ఎయిర్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ G200ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాగా, గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 7న అలస్కాలో ఓ విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌరవిమానం వాషింగ్టన్ సమీపంలో ఢీకొన్నాయి. దీంతో 67 మంది మరణించారు. అదేవింధంగా ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో ఓ విమానం కుప్పకూలడంతో ఆరుగురు చనిపోయారు. అయితే, విమానయాన రంగంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు, విమాన టెక్నాలజీ లోపాలు వంటి కారణాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.