- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Secunderabad డెక్కన్ మాల్ ప్రమాదంపై కేసు నమోదు
దిశ, బేగంపేట: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారకులైన ఇద్దరు భవన యజమానులు ఓవైసీ, రహీంలపై కేసు నమోదైంది. ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేసినట్లు రామ్ గోపాల్ పేట ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ తెలిపారు. భవనాలకు సంబంధించిన ఫైర్ సేఫ్టీలు లేకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహించిన ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాద ఘటనలో ముగ్గురు కార్మికులు భవనంలో ఉండిపోవడంతో బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ముగ్గురు గల్లంతయినట్లు పేర్కొన్నారు. జానీద్, వాసిం, జహంగీర్ అనే కార్మికులు గుజరాత్‌కు చెందిన వారని తెలిపారు. ముగ్గురు కార్మికులు ఈ భవనంలో పనిచేస్తున్నారని సీఐ తెలిపారు. ఇప్పటివరకు వీరి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ తెలిపారు.