- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బోయినపల్లిలో పాఠశాల బస్సు బోల్తా
by Sridhar Babu |

X
దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డెయిరీ ఫాం ప్రధాన రహదారి వద్ద జీడిమెట్లకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా కొట్టింది. బోయినపల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లారీని తప్పించబోయే క్రమంలో వేగంగా వచ్చిన స్కూల్ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల నుండి విద్యార్థులను తీసుకువచ్చే క్రమంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు రహదారిపై పడిపోయిన బస్సును అక్కడి నుండి తొలగించారు. ఈ ఘటనలో క్లీనర్ కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Next Story