కడియం శ్రీహరికి అండగా ఉండండి

by Sridhar Babu |
కడియం శ్రీహరికి అండగా ఉండండి
X

దిశ, లింగాలఘణపురం/ స్టేషన్ ఘన్ పూర్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మీరందరూ అండగా ఉండండి.. నియోజకవర్గ అభివృద్ధి నేను చూసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరై నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగానే విద్యా శాఖకు సంబంధించి జాఫర్గడ్ మండలం, కోనాయచలం గ్రామంలో రూ. 200 కోట్లతో యంగ్ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయానికి, అలాగే నియోజకవర్గ కేంద్రంలో రూ. 5.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, ఆరోగ్య శాఖకు సంబంధించి నియోజకవర్గ పరిధిలో రూ. 45.5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవనానికి, ఆర్&బీ శాఖకు సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో రూ. 26 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేశారు.

నీటి పారుదల శాఖకు సంబంధించి రూ.148.76 కోట్లతో జేసీఆర్డీఎల్ఐఎస్ ఫేస్ - 2 కింద ఆర్ఎస్ ఘన్​పూర్ మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ నిర్మాణ పనులకు, నియోజకవర్గంలోని ప్రజాపాలన గ్రామసభ మోడల్ గ్రామాల్లో రూ. 25.6 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, పీఆర్ శాఖ ఆధ్యర్యంలో సీసీ రోడ్ల కోసం రూ. 38.5 కోట్లు, విద్యుత్ శాఖకు సంబంధించి రూ. కోటితో నియోజకవర్గ పరిధిలో టీజీఎన్పీడీసీఎల్ డివిజనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 2.26 కోట్లతో రఘునాథపల్లి మండలం, కుర్చపల్లి గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రం, రూ. 2.29 కోట్లతో జాఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రం, రూ. 2.5 కోట్లతో చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రం, రూ. 2.48 కోట్లతో రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రం, రూ. 1.48 కోట్లతో ధర్మసాగర్ లో రాయగూడెం ఉప కేంద్రం ప్రారంభోత్సవం చేశారు.

గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూ. 23.89 కోట్లతో బంజారా భవన్, బీటీ రోడ్ల నిర్మాణం, కుడా కింద రూ. 1.76 కోట్లతో పెద్దపెండియాల్ గ్రామంలో రోడ్ల విస్తరణ పనులు, అదే విధంగా రూ. 2.10 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బస్సులు, ఉద్యాన వనశాఖకు సంబంధించి ఆయిల్ సీడ్ కలెక్షన్ సెంటర్ కోసం రూ. 0.65 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క), ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్వినీ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, జీడికల్ దేవస్థానం చైర్మన్ ఎల మూర్తి,నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed