మాటలు జాగ్రత్త హరీష్ రావు..! ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాస్ వార్నింగ్

by Ramesh Goud |
మాటలు జాగ్రత్త హరీష్ రావు..! ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: హరీష్ రావు పూర్తిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని మాజీమంత్రి హరీష్ రావును (BRS Leader Harish Rao) ఉద్దేశించి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Government Whip Beerla Ailaiah) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ నేత (BNRS Leader) పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరడుల ఆజానుబాహుడు హరీష్ రావుకు మెదడు మోకాళ్లలో ఉందో.. ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, అధికారంలో పదేళ్లలో కానీ కేసీఆర్ (KCR) మాట్లాడిన భాషను ప్రజలు గమణించారని అన్నారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో కుటుంబ సభ్యలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తగదు అని, ఇలా మరోసారి పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం హరీష్ రావుకు బూతు పురాణంలా అనిపించిందా అని ప్రశ్నించారు. ఒళ్లు బలిసి మాట్లాడుతున్నావా లేక తోలు మందం అయ్యి మాట్లాడుతున్నావా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ మామ మాట్లాడితే మంచి మాటలు.. సీఎం రేవంత్ రెడ్డి సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడితే బూతు పురాణంలా అనిపిస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మామ జాతిపిత అనుకుంటున్నారా..? తిట్ల పురాణానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని హాట్ కామెంట్స్ చేశారు. మీ కుటుంబ సభ్యులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు సహిస్తారా అని ఫైర్ అయ్యారు. అంతేగాక మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం జాగ్రత్త అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ (Congress MLA Mass Warning) ఇచ్చారు.

Next Story

Most Viewed