వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

by Jakkula Mamatha |
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
X

దిశ, బాపట్ల: ఎన్నో ఏళ్లుగా వీధి కుక్కల బెడద నుంచి బాధపడుతున్న బాపట్ల పురపాలక ప్రజలకు బాపట్ల మున్సిపల్ రఘునాథ రెడ్డి పరిష్కారం కల్పించారు. బాపట్ల పట్టణంలోని మూడో వార్డు రాజీవ్ గాంధీ కాలనీ జంతు కబేళ వద్ద దాదాపు సుమారు రూ.10లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ క్రింద వెచ్చించి విధికుక్కల సంతాన నియంత్రణ కేంద్రంను ఏర్పాటు చేశారు. బాపట్ల పురపాలక సంఘం పరిధిలో ఎన్నో ఏళ్లుగా వీధి కుక్కలు వేలాదిగా పెరిగిపోయి. పలు ప్రాంతాల్లో ఎంతో మంది ప్రజలు కుక్క కాటుకు గురయ్యారు.

ఈ సమస్యపై అనేక మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయలేకపోయారు. కానీ ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాత్రం సమస్య గురించి తెలుసుకున్న అతి కొద్ది రోజుల్లోనే వాటి నియంత్రణకు కృషి చేయడం అభినందనీయం. నేటి నుంచి పట్టణ పరిధిలో ఎవరికైనా వీధి కుక్కల నుంచి సమస్యలు తలెత్తితే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం తెలపాలని కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. తమ సిబ్బంది వెంటనే వచ్చి ఆ వీధి కుక్కలను సంరక్షణ కేంద్రానికి తరలించి సంతానోత్పత్తి కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed