- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వార్నీ.. ఆటో డ్రైవర్ ఎంత పని చేశాడో చూడండి!
by Naveena |

X
దిశ ,నిజాంసాగర్ : మహిళ ప్రయాణికురాలి మెడలో నుంచి బంగారం, వెండి వస్తువులను ఆటో డ్రైవర్ దోచుకెళ్లిన సంఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన మ్యాతరీ భూమవ్వ అనే మహిళ శనివారం సాయంత్రం తన కూతురి ఇంట్లో పూజ ఉందని నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి వెళ్తుంది. అయితే మార్గమధ్యలో నిజాంసాగర్ బస్స్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తుండగా.. ఆటో డ్రైవర్ , ఓ మహిళ ఆమెను అచ్చంపేటకు వెళుతున్నామని తీసుకెళ్లారు. ఆమెను ఓ నిర్మానుశ్య ప్రదేశానికి తీసుకువెళ్లి.. ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులను దోచుకెళ్ళినట్లు బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
Next Story