- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లి డ్యాన్స్లో రివాల్వర్తో సర్పంచ్ భర్త హల్ చల్
దిశ, వెబ్ డెస్క్: అందరూ పెళ్లి వేడుకలో ధూమ్ ధామ్ గా డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చి రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరుపుతూ హల్ చల్ సృష్టించాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఘటన వెస్ట్ బీహార్ లోని పాట్నాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిఘా పోలీస్ స్టేషన్‌లోని నక్తా దియారా ప్రాంతంలో ఓ పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన పెళ్లి డ్యాన్స్ లో స్థానిక సర్పంచ్ భర్త విమల్ రాయ్ అనే వ్యక్తి రివాల్వర్ తో కాల్పులు జరుపుతూ నానా భీభత్సం సృష్టించాడు. దీంతో డ్యాన్స్ చేస్తున్నవాళ్లతో మిగతావాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా విమల్ రాయ్ గతంలో పలు కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లినట్లు సమాచారం.