Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్, ఇద్దరు మృతి

by Shiva |
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్, ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తిరుపతి జిల్లా (Tirupati District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి (Chandragiri) మండల పరిధిలోని రంగంపేట (Rangampet) నుంచి సోమవారం తెల్లవారుజామున భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన ఓ అంబులెన్స్ అతివేగంతో అదుపుతప్పి వారి పైనుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, పొగమంచు (Fog) కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed