రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, మెట్ పల్లి : మెట్ పల్లిలోని వెంకట్రావుపేట శివారులో గల తిరుమల అపార్ట్మెంట్ వద్ద కారు బైకు ఢీకొని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన మనోహర్ అనే వ్యక్తి మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ముందున్న టైరు పగలడంతో అదుపుతప్పి మెట్ పల్లి వైపు వస్తున్న మోటార్ సైకిల్ వాహనదారున్ని బలంగా ఢీ కొట్టింది.

దీంతో ద్విచక్ర వాహం పై ప్రయాణిస్తున్న మనోహర్ కి తీవ్రగాయాలు అవ్వగా స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మోటార్ సైకిల్ వాహనదారుని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో ఆర్మూర్ వద్ద మరణించినట్లు మెట్ పల్లి ఎస్సై శ్యామరాజ్ తెలిపారు. నిందితుని పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story