రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..

by Sumithra |
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..
X

దిశ, మల్యాల : మల్యాల ఎక్స్ రోడ్ సమీపంలో కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారి పై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కరీంనగర్ వైపు నుండి వస్తున్న వాహనానికి జగిత్యాల్ వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనం వేరొక వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జగిత్యాల మంచినీళ్ళ బావికి చెందిన రాము అనే యువకుడు మృతి చెందగా మరో యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. స్పందించిన స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story