మా నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడి

by Javid Pasha |
మా నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: తమ నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. రాజ్ థాక్రే కుమారుడు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు అమిత్ థాక్రేను నాసిక్ జిల్లా సిన్నార్ టోల్ గేట్ వద్ద ఆపారు. దీంతో తమ నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ గేట్ వద్ద విధ్వంసం సృష్టించారు. కర్రలతో బిల్ కౌంటర్ల అద్దాలు పగులగొట్టారు. అడ్డొచ్చిన టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. టోల్ సిబ్బందిపై ఆయన అనుచరులు దాడికి దిగారు. టోల్ గేట్ వద్ద విధ్వంసం సృష్టించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Next Story