- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lone Appల మోసాలపై అవగాహన.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రాచకొండ పోలీస్
దిశ, సిటీక్రైం: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారీ లోన్ యాప్ ద్వారా తీసుకున్న అప్పు 3 వేలు...కాని లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు, బెదిరింపులకు అతను చెల్లించింది.. అక్షరాలా 25.60 లక్షలు. 3 వేల అప్పుకు ఇన్ని లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా మొదటి అడుగులోనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పరువు పోతుందనే భయంతో ఇప్పుడు అతని మెడకు ఉచ్చు బిగుచుకునేలా చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలు చేసి నీ పరువు తీస్తామని బెదిరించారు, భయపెట్టించారు. అప్పుడే ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించి ఉంటే అతను ఆర్ధిక ఊబిలో కూరుకుపోయే వాడు కాదు. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరుగుతుండడంతో లోన్ యాప్‌ల జోలికి పోవద్దని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్ యాప్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఓ అవేర్ నెస్ విడియోను తీసి దానిని సోషల్ మీడియాలో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇలాంటి లోన్ యాప్‌ల వలలో చిక్కుకున్న వారు భయాందోళనకు గురి కాకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, డయల్ 100 లేదా 1930కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేగాని మీరు చేయని తప్పుకు కేవలం గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపులకు భయపడి ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
#SundaysWeeklyThemeVideo
— Rachakonda Police (@RachakondaCop) November 3, 2024
లోన్ యాప్ నేరగాళ్ళతో తస్మాత్ జాగ్రత్త!
లోన్ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారు.
లోన్ యాప్ నేరగాళ్ల బారిన పడకండి, ఒకవేళ మీరు బాధితులు అయితే వెంటనే 1930 కు కాల్ చేయండి.#RachakondaPolice#CyberSafety#ThinkBeforeYouClick… pic.twitter.com/YulHR45ESm