- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైకో కిల్లర్.. మార్నింగ్ పేపర్లు ఏరుకోవడం.. రాత్రికి హత్యలు చేయడం
దిశ, డైనమిక్ బ్యూరో : ఉదయం పాతపేపర్లు ఏరుకుని జీవనం సాగించేవాడు. అయితే ఆ డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇందుకు ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేశాడు. ఉదయం పాతపేపర్లు ఏరుకుంటూ... ఒంటరిగా ఉన్నవారిని గుర్తిస్తాడు. సాయంత్రం వారి ఇంటిపై దాడి చేసి హత్యకు పాల్పడుతుంటాడు. ఇలా ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని హత్య చేస్తున్న సైకో కిల్లర్‌ను పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిల్లర డబ్బుల కోసం అంకమ్మరావు ఈ హత్యలకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అంకమ్మరావు 2022 జూన్లో ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఆ తర్వాత ఆ వృద్ధురాలి నుంచి రూ.2 లక్షలను దోచుకున్నాడు. అయితే అంకమ్మరావు ఈ హత్య చేసినట్టుగా రుజువు కాకపోవడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యాడు. ఒకసారి జైలుకు వెళ్లిన తర్వాత కూడా అంకమ్మరావులో ఎలాంటి మార్పురాలేదు.
తాజాగా ఈనెలలో మరో ముగ్గురిని అంకమ్మరావు హత్య చేశాడు. ఈ నెల 5న ఓ వృద్ధురాలిని హత్య చేసి రూ.500 ఎత్తుకెళ్లాడు. ఈ నెల 10న వేర్వేరు చోట్ల ఇద్దరిని హత్య చేశాడు. ఒకరి వద్ద రూ.40, మరొకరి వద్ద రూ.120 దోచుకున్నాడు. ఈ హత్యకేసులను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి అంకమ్మరావు ఈ హత్యలు చేసినట్టుగా నిర్ధారించారు. దీంతో అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సైకో మనస్తత్వం కారణంగా హత్య చేశాడా, లేక ఇతరత్రా కారణాలతో హత్య చేశారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: