స్పా సెంటర్‌లో కండోమ్, గంజాయి ప్యాకెట్లు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆ ఇద్దరు.. (వీడియో)

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-12-01 15:26:16.0  )
స్పా సెంటర్‌లో కండోమ్, గంజాయి ప్యాకెట్లు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆ ఇద్దరు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : వ్యాపారం ముసుగులో అడ్డదారులు తొక్కుతూ అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారుతున్నారు కొందరు. ఇలాంటి ఇల్లీగల్ దందాలతో అసలైన వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదన్నది జగమెరిగిన సత్యమే. స్పా సెంటర్ పెట్టిన కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఉపాధి పొందాల్సిన వ్యాపారి.. అడ్డదారులు తొక్కాడు. స్పా సెంటర్‌లోనే అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయించడంతోపాటు దర్జాగా గంజాయి ప్యాకెట్లను సైతం విక్రయిస్తున్నాడు. ఒంగోలు(Ongole) నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒంగోలు బండ్లమిట్ట సెంటర్ పార్వతమ్మ గుడి వద్ద గత కొంతకాలంగా వీ2 (V2 Beauty Salon & Spa )మసాజ్ పార్లర్ నడుస్తోంది. అయితే అక్కడికి వచ్చే కస్టమర్ల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటం.. అసభ్యకరంగా ప్రస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఒంగోలు(ఒంగోలు Town Police) పట్టణ పోలీసులు మెరుపు దాడి చేయగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. స్పా షటర్లు మూసి ఉంచిన నిర్వాహకులు లోపల ఓ పురుషుడికి మహిళతో మసాజ్ చేయిస్తూ పోలీసులకు చిక్కారు. స్పా సెంటర్‌ను మొత్తం తనిఖీ చేయగా.. కుప్పలు, తెప్పలుగా కండోమ్(condoms ) ప్యాకెట్స్, గంజాయి(marijuana) ప్యాకెట్స్ బయటపడ్డాయి. వాటితో పాటు కొంత నగదు లభించింది.

V2 స్పాను తనిఖీ చేసిన పోలీసులకు మొదట అంతా నార్మల్‌గానే కనిపించింది. క్షణ్ణంగా సోదా చేయగా.. సీలింగ్ లైట్లు అమర్చే రంద్రాలలో 10 గంజాయి ప్యాకెట్లు లభించాయి. అలాగే 25 కండోమ్ ప్యాకెట్లతోపాటు మరో పది కండోమ్ బాక్సులను గుర్తించారు పోలీసులు. కండోమ్స్, మాదక ద్రవ్యాలు దొరకడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వెంటనే స్పా నిర్వహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కండోమ్, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందస్తుగా రావడంతో అక్కడ ఉన్న యువతులు పరారీ అయినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null