చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Shiva |
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ, చౌటకూర్ : బైక్ అదుపు తప్పి గాయాల పాలైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శివంపేట గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. పుల్కల్ ఎస్ఐ విజయ్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన మంగళి యాదగిరి (28) అనే వ్యక్తికి చౌటకూర్ మండలం తాడ్దాన్పల్లి శివారులో రాయల్ కింగ్ పేరుతో ఓ దాబా ఉంది. అయితే, శివంపేట్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుపై వడ్లు ఆరబోశారు. కాగా, ఈనెల 25న సంగారెడ్డినుంచి దాబాకు వెళ్తున్న యాదగిరి వడ్ల కుప్పలను తప్పించబోయి బైక్ అదుపు తప్పింది కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. మృతుడి సోదరుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story