- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుదిశ్వాస వరకు ఎర్రజెండాలో కొనసాగిన పరుచూరి కుటుంబరావు..
దిశ, నిజామాబాద్ సిటీ : కమ్యూనిస్టు విలువలు చాలా గొప్పవి, ఆ సిద్దాంతాలు ఆయా కుటుంబాలను ఉన్నతంగా నిలబెడతాయని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నగర కార్యదర్శి (అడ్వకేట్) పరుచూరి శ్రీధర్ తండ్రి పరుచూరి కుటుంబరావు బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. ఆయన కళ్ళను ఇతరులకు చూపునివ్వాలని లయన్స్ క్లబ్ వారికి అందజేశారు. అనంతరం గురువారం రోజున ఆయన శరీరాన్ని ప్రభుత్వ వైద్యవిద్యార్థుల పరిశోధనల కోసం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కుటుంబసభ్యుల సమక్షంలో అందజేశారు.
అంతకు ముందు మాధవనగర్ లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సభలో మాధవనగర్ గ్రామ పెద్దలు, ఆయన స్నేహితులు, వివిధ వామపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కుటుంబరావు బామర్ది మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరివరకు కుటుంబరావు తాను నమ్మిన సిద్ధాంతంపట్ల నిబద్దతో ఉంటూ గ్రామంలో తారతమ్యాలు లేకుండా ఏ సమస్య వచ్చినా నిక్కచ్చిగా నిలబడి తప్పును తప్పని న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడే వారని అన్నారు.
ఒక సందర్భంలో మనసు నొప్పించుకున్న వాళ్లకు తర్వాత వారికి ఏది న్యాయబద్ధంగా ఉందో అర్థం చేసుకుంటే చాలు అనే వారని అన్నారు. ఏది న్యాయమైన నిర్ణయం అయితే అదే నిర్ణయం చేసేవారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా వామపక్ష భావజాలానికి పరిచయం చేసి ఆదర్శంగా తమ పిల్లలను తీర్చిదిద్ది వామపక్ష పార్టీలో పనిచేసే విధంగా, నిలబడే విధంగా ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి అన్నారు. మేధావులకన్నా మేదస్సు ఎక్కువ కలిగిన మహా గొప్ప వ్యక్తి మాధవ నగర్ లెజెండ్ కుటుంబరావు అని అన్నారు.
కమ్యూనిస్టు విలువలు చాలా మహోన్నతమైనవని హిమాలయ శిఖరాల కన్నా ఉన్నతమైనవని అలాంటి ఉన్నతమైన విలువల కోసం బావగారైన కుటుంబరావు దగ్గరే నేను రాజకీయాలు నేర్చుకున్నానని అన్నారు. తాను ఎన్నికలు పోటీ చేసే ముందు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే ముందు కుటుంబరావు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు నిన్ను నమ్మి ఎన్నుకున్న ప్రజల వైపు నిలబడాలని తాను ఒక చెంప దెబ్బ వేసి (గుర్తు ఉండటం కోసం) నామినేషన్ కు పంపించేవారని, ప్రజల పక్షాన నిలబడినప్పుడే నీకు విలువ దక్కుతుందని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి సభాఅధ్యక్షత మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు వహించారు. న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, సీపీఎం సీనియర్ నాయకులు స్నేహితుడు అన్నే నారాయణరావు, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లాకార్యదర్శి ఆకుల పాపయ్య, సీపీఐ నాయకులు కంచర భూమయ్య, కుటుంబరావు తమ్ముడు బోసుబాబు, కూతురు సంధ్య, కుమారుడు శ్రీధర్ మురళి, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కళాశాలలో కుటుంబరావు భౌతిక కాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల జిల్లా రాష్ట్ర జిల్లాస్థాయి నాయకులు ప్రజాసంఘాల నాయకులు కుటుంబరావు బంధువులు, కుటుంబ సభ్యులు మాధవనగర్ వాసులు అందరూ హాజరయ్యారు.