నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

by Sumithra |
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..
X

దిశ‌, గండిపేట్ : డివైడ‌ర్‌ను ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో వ్యక్తి మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాలయ్యాయి. ఈ సంఘ‌ట‌న నార్సింగి పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం పెద్ద అంబ‌ర్‌పేట నుంచి గచ్చిబౌలీ వెళ్తున్న టాటాఏస్ డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్రగాయాల‌య్యాయి.

విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మితిమీరిన వేగంతో దూసుకువ‌చ్చి అదుపు త‌ప్పి ప‌ల్టీలు కొట్టింద‌ని పోలీసులు తెలుపుతున్నారు. ఈ మేర‌కు కేసున‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story