బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి..

by Kalyani |
బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(78) వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బొలెరో వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వృద్ధురాలి మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story