- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉత్తర్ పల్లి హత్య కేసులో కొత్త కోణం
దిశ, సంగారెడ్డి అర్బన్ : ఈ నెల 30న ఉదయం ఉత్తర్ పల్లి గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గురైన వ్యక్తిని సాయంత్రంలోపే గుర్తించారు. సంగారెడ్డి పట్టణంలోని ఎల్ఐజి కాలనీలో నివాసం ఉంటున్న యం.రాజు (35) గా నిర్ధారణకు వచ్చారు. మృతుడు రాజు కొండాపూర్ మండల పరిధి క్రౌన్ బీర్ ఫ్యాక్టరీ లోని క్యాంటీన్ లో పని చేసేవాడు. అయితే గత పది రోజులుగా అతను తాగుడికి బానిసై డ్యూటీ కి వెళ్లకుండా తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేనట్లు తెలిసింది. ఈ కేసులో రాజును ఎవరు హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాల వల్ల ఈ హత్య జరిగిందా…? లేక ఎవరైనా అతడిపై కక్ష పెంచుకొని హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఎస్సై చరణ్ రెడ్డి చెబుతున్నారు. కాగా మృతునికి ఓ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.