సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యం: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్

by Mahesh |   ( Updated:2023-03-18 06:18:28.0  )
సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యం: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇండర్వ్యూ వీడియోలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యల కేసుల్లో ప్రధాని నింధితుడైన గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ తాజాగా జైలు నుంచి రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పాడు. బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడమో నా జీవిత లక్ష్యం అని అన్నాడు. సల్మాన్ కు ఉన్న భద్రతను తొలగిస్తే నేను అతన్ని చంపడం ఖాయం అన్నాడు. కాగా కొద్ది రోజుల క్రితం ఇలానే ఓ వీడియోను జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ విడుదల చేశాడు. కానీ ఆ వీడియో పంజాబ్ జైళ్ల నుంచి కాదని పోలీసులు తేల్చి చెప్పారు. కాగా తాజా వీడియో తో పోలీసులు మరోసారి అప్రమత్తం అయ్యారు.

Also read: యశ్ నన్ను వేధింపులకు గురి చేశాడు.. కేజీఎఫ్ హీరోయిన్?

Advertisement

Next Story