- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్య చేసి... డస్ట్ కవర్ లో చుట్టి...
దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో గుర్తు తెలియని మహిళ శవం లభించింది. కోర్టు పక్కన కొద్ది దూరంలో ఇళ్ల మధ్యలో ఒక ప్లాస్టిక్ కవర్ లో శవాన్ని చుట్టి ఇక్కడ పడేశారు. మహిళ ఒంటిపై పసుపు రంగు దుస్తులు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం స్థానిక ఏసీపీ రంగస్వామి, సీఐ విజయ్ కుమార్, ఎస్సై శరత్ సందర్శించి శవాన్ని పరిశీలించారు.
క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ సుమారు 35 నుండి 45 సంవత్సరాల వయసుగల గుర్తుతెలియని మహిళను ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసినట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళ రెండు చెవులు కత్తిరించి చెవి కమ్మలు తీసివేసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. స్థానిక సీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక మరిన్ని విషయాలు తెలుస్తాయని ఏసీపీ పేర్కొన్నారు.
- Tags
- Murder