ఆ కారణంతో.. 4 నెలల కొడుకును కొట్టి చంపిన తల్లి

by Hamsa |   ( Updated:2023-01-09 06:03:29.0  )
ఆ కారణంతో.. 4 నెలల కొడుకును కొట్టి చంపిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: పసి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే వారి ప్రాణాలను బలి తీపుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకే వారిపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మంది మూఢనమ్మకాలను నమ్మి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఓ తల్లి మూడపమ్మకాలను నమ్మి తన ఆరోగ్యం కుదుటపడుతుందని కొడుకును చంపేసింది.

పోలీసులు వివరాలు ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ధనుదీ గ్రామంలో మంజూ అనే వివాహిత ఇటీవల ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఆమె భర్త కాన్పూర్‌లో కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మంజూకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. కూమారుడిని బలి ఇస్తే తన ఆరోగ్యం కుదుటపడుతుందని నమ్మి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకుని 4 నెలల కొడుకును అతి కిరాతకంగా పారతో కొట్టి చంపేసింది. ఇంట్లో నుండి శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి మంజూను నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. కన్న కూమారుడిని చంపిన తల్లి నిర్వాకంతో స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Next Story