- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెదక్ సజీవ దహనం కేసు: వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు
దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లా టేక్మల్ మండలం వెంకటాపూర్ వద్ద ఈనెల 8న జరిగిన కారు దగ్ధం, వ్యక్తి సజీవ దహనం కేసులో మృతుడిని పోలీసులు గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బులు రూ.7 కోట్లు కాజేయాలని నిందితుడు ధర్మా నాయక్ కారు డ్రైవర్‌ను హత్య చేసి తన చనిపోయినట్లు నమ్మిద్దామని భావించి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మృతుడిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలుకా లాగలూద్ గ్రామానికి చెందిన బాబు మారోతి గలగాయే(42)గా పోలీసులు గుర్తించారు. నిందితులు ధర్మా, అతని మేనల్లుడు తేజవత్ శ్రీనివాస్ కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అడ్డా కూలీ అయిన బాబును గత వారం తీసుకెళ్లారు.
హత్య చేసి బీమా సొమ్ము కాజేయాలని ప్లాన్ చేశారు. నిజామాబాద్ సీపీ పరిధిలో మృతుడు కనిపించడం లేదని ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు రైల్వే స్టేషన్లలో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ లో మృతుడు రైలు ఎక్కినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.
కూలీ పని కోసం బాబు నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో దిగినట్లు గుర్తించారు. ధర్మానాయక్ మొదలు నాంపల్లికి చెందిన అంజయ్య అనే వ్యక్తిని చంపాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అంజయ్యను తీసుకెళ్లాలనుకున్న ధర్మా చివరి నిమిషంలో ప్లాన్‌ను విరమించుకున్నాడు. అంజయ్య మద్యం తాగి ఉండటంతో తన బీమా క్లెయిమ్ కాదనే ఉద్దేశ్యంతో డ్రాప్ అయినట్లు తెలిసింది. అంజయ్యను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.