ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి..

by Sumithra |
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి..
X

దిశ, భద్రాచలం : మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఒడిస్సా రాష్ట్రం నుండి చత్తీస్ ఘడ్ లోకి మావోయిస్టుల చొరబాట్లు గురించి జవాన్లకు సమాచారం అందడంతో సరిహద్దు అడవులలో గాలింపు చర్యలు చేపట్టారు. కలిమెల బ్లాక్‌లోని జినెల్ గూడ అటవీప్రాంతంలో మావోలు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. కాల్పుల్లో డీవీఎఫ్ జవాన్ దమ్రుబాద్ నాయక్ గాయపడ్డారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు మావోయిస్టులను సైనికులు అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story