కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య..

by Sumithra |
కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య..
X

దిశ, చింతలమానేపల్లి : మండలంలోని కర్జెల్లి గ్రామానికి చెందిన అన్నం భీమయ్య (35) అనే వ్యక్తి గురువారం గ్రామ సమీపంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజుల నుండి భార్య, భర్తల మధ్య గొడవ జరిగేదని తెలిపారు. గొడవల నేపథ్యంలో భార్య తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది.

ఈ క్రమంలో భీమయ్య మనస్థాపానికి గురై వ్యవసాయ భూమిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బాపు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి విచారణ చేపడుతున్నామన్నారు. కౌటాల సీఐ సాధిక్ పాషా, ఎస్సై విజయ్ దర్యాప్తులో పాల్గొన్నారు. గ్రామ పెద్దల సమక్షములో పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య పోషక్క ఇద్దరు కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement

Next Story