పడవ ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య

by Mahesh |
పడవ ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: మలప్పురం పడవ బోల్తా పడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. కేరళ రాష్ట్రంలోని జిల్లాలో తానూర్ తీరంలో పర్యాటకుల బోటు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన 21 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా చాలా మంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద అధికంగా ఉండటంతో తీవ్ర అంతరాయం జరుగుతుందని సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు.

Advertisement

Next Story