HYD: కోకాపేట్‌లో భారీ అగ్నిప్రమాదం

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-15 18:36:28.0  )
HYD: కోకాపేట్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతమైన కోకాపేట్‌(Kokapet)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. శనివారం సాయంత్రం GAR టవర్స్‌(GAR Towers)లోని రెస్టారెంట్‌లో సిలిండర్ పేలింది. దీంతో ఆ భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు.. స్థానికులు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన భవనంలో పలు ఐటీ కంపెనీలు(IT Companies) ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

వృద్ధుని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​

Next Story