చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్త్ర దొంగ అరెస్ట్..

by Vinod kumar |   ( Updated:2023-08-10 15:10:12.0  )
చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్త్ర దొంగ అరెస్ట్..
X

దిశ, హన్మకొండ: తాళం వేసిన ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన మరో ముగ్గురు నిందితులను మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు రూ. 7 లక్షల రూపాయల విలువగల 103 గ్రాముల బంగారు, 824 గ్రాములు వెండి ఆభరణాలతో పాటు, రెండు ఐప్యాడ్లు, 19 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పంతగిరి రాజా ఆలియాస్ నాగరాజు, బాక్రాపేట గ్రామం, సిద్ధఫుట్ మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు కాగా మరో ముగ్గురు నిందితులు వరంగల్ ప్రాంతానికి చెందిన పోలిపాక సందీప్, ఆడెప్ రమేష్, కాజీపేటకు చెందిన సాతూరి వెంకటేళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ అబ్దుల్ వివరాలను వెల్లడించాడు.


పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు పంతగిరి రాజా రోజువారి కూలీ చేసేవాడు. గతంలో తనకు వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు తన అన్నయ్యతో కల్సి కడప జిల్లాలో ఎర్రచందనం, కరెంట్ తీగలను చోరీ చేసేవాడు. నిందితుడు పలుమార్లు పోలీసులు అరెస్టు చేయడంతో పాటు, నిందితుడి ఆంద్రప్రదేశ్ అటవీ శాఖ పోలీసులు పీడీయాక్ట్ క్రింద జైలుకు తరలించారు. జైలు విడుదలయిన తరువాత నిందితుడు దేవాలయాల్లోని హుండీల్లోని డబ్బు చోరీ చేస్తుండంతో కనిగిరి, ఎలిగండ్ల పోలీసులు నిందితుడి మరో అరెస్టు చేయగా నిందితుడు జైలు నుండి బయటికి వచ్చాక ఆంధ్రలో చోరీలకు పాల్పడితే పోలీసులు గుర్తిస్తారని, నిందితుడు గత నెల జూన్ మాసంలో కాజీపేటకు వచ్చి తిలకనగర్ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.


పగటి వేళల్లో బోగ్గు కాల్చేవాడు. రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇండ్లను గుర్తించి.. తాళం పగులగొట్టి ఇంటిలోని బంగారు, వెండి, ఇతర వస్తువులను చోరీ చేసేవాడు. ఈ విధంగా నిందితుడు మొత్తం ఆరు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో మడికొండ, కాజీపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు చొప్పున చోరీ చేశాడు. ఈ రోజు ఉదయం మడికొండ ధర్మసాగర్ మార్గంలోని పెద్దమ్మ గుడి వద్ద తనీఖీలు నిర్వహిస్తున్న మడికొండ పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన నిందితుడుని పోలీసులు తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు ఆభరణాలు గుర్తించారు.

దీంతో పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకోని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో పాటు ఇతను ఇచ్చిన సమాచారంలో మిగితా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బంగారు, వెండి, ట్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు, మడికొండ, కాజీపేట ఇన్సెస్పెక్టర్లు వేణు, రాజు, ఎస్ఐలు రాజబాబు, దివ్యా, ఏ.ఏ.ఓ సల్మాన్పషా, ఎ.ఎస్.ఐ చంద్రమౌళి, కానిస్టేబుల్ విజయ్, నాగేశ్వరావు, వెంకటస్వామి, మంగీలాల్, ఐటీకోర్ కానిస్టేబుల్ నగేష్ లను డీసీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed