- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏటీఎం చోరీ కేసును, చైన్ స్నాచింగ్ కేసును చేధించిన కేపీహెచ్‌బీ పోలీసులు..
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల వ్యవధిలో జరిగిన చైన్ స్నాచింగ్, ఏటిఎం చోరీ కేసులను కేపీహెచ్‌బీ పోలీసులు చేధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు, సీఐ కిషన్ కుమార్‌తో కలిసి వివరాలు వెళ్లడించారు. నిజాంపేట్ రోడ్డు ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న శంకబత్తుల మహాలక్ష్మీ(56) ఈ నెల 12వ తేది రాత్రి 7:15 గంటల ప్రాంతంలో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదే రోజు మద్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టడంతో తలుపు తెరవగా ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి తనను బలవంతంగా లోపలికి ఈడ్చుకుంటు వెళ్లి తన కళ్లలో పిండిని చల్లి తన మెడలో ఉన్న 65 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కుని పరారైనట్టు మహాలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించి సీసీ కెమెరాల సహాయంతో ప్రశాంత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మల్ల వెంకటేశ్వర్ రావు(24)గా గుర్తించారు. నిందితుడిని మియాపూర్‌లోని రంగ థియేటర్ వద్ద అదుపులో తీసుకున్నట్టు డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఏటీఎం చోరీ కేసులో..
కేపీహెచ్‌బీ కాలనీలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలో చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించారు. డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ కొమ్ము వెంకట శ్రీధర్ శాస్త్రి(56)కి 13వ తేదిన ఉదయం పది గంటల ప్రాంతంలో పూణే మహారాష్ట్ర బ్యాంక్ సర్వైలెన్స్ టీం నుంచి కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం బాక్సును తెరిచి అందులో నుంచి డబ్బులు దొంగిలించినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో మేనేజర్ శ్రీధర్ శాస్త్రి వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి ఏటీఎంలో చోరి జరిగినట్టు గుర్తించి కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించాడు.
ఇదిలా ఉండగా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడి గురించి గాలించడం ప్రారంభించారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా చోరికి పాల్పడింది ఏటీఎం టెక్నిషియన్‌గా పని చేస్తున్న సుద్దాల హరీష్(29)గా గుర్తించారు. హరీష్ పెట్రో ఏటీఎం సర్వీసెస్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు, ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చే సుద్దాల హరీష్ నకిలీ తాళం చెవిని తయారు చేసుకుని ఏటీఎం బాక్సు తెరిచి అందులో నుంచి 5 లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. రెండు కేసులను చాకచక్యంగా చేధించిన కేపీహెచ్‌బీ పోలీసులు, బాలానగర్ సీసీఎస్ పోలీసులను డీసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు.