కోల్‌కతాలో భారీగా బంగారం పట్టివేత.. సముద్రమార్గం గుండా తరలింపు

by GSrikanth |   ( Updated:2023-02-13 11:29:27.0  )
కోల్‌కతాలో భారీగా బంగారం పట్టివేత.. సముద్రమార్గం గుండా తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలో భారీగా బంగారం పట్టిబడింది. రూ.14 కోట్ల విలువైన 24.4 కిలోల బంగారాన్ని అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఈస్టర్న్ గేట్‌వే ద్వారా కొందరు గుర్తు తెలియని దుండగులు అక్రమంగా బంగారం తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్న డీఆర్ఐ.. బంగ్లాదేశ్ నుంచి సముద్రమార్గం ద్వారా బంగారం తలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అసోం, త్రిపుర, కోల్‌కతాతో పాటు బంగ్లాదేశ్ డీఆర్ఐ అధికారులు పహారా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed