బ్రేకింగ్ : విద్యార్థినిపై కత్తితో యువకుడి దాడి

by Sathputhe Rajesh |
బ్రేకింగ్ : విద్యార్థినిపై కత్తితో యువకుడి దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థునులపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఓ చోట మహిళలు, యువతులపై దాడులు జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా కళాశాల విద్యార్థిని‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుమడా గ్రామంలో చోటు చేసుకుంది. బిసంకటక్ గ్రామానికి చెందిన నిహారికా మహంతి గుమడాలోని ద్రౌపది విద్యాపీఠం కాలేజీలో ప్లస్ టు చదువుతోంది.

పరీక్ష రాసి వస్తుండగా జగన్నాథ మందిరం రహదారిలో ఓ బ్యాంక్ సమీపంలో యువకుడు కత్తితో నిహారిక మెడ కోశాడు. తీవ్ర రక్త స్రావమైన ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత నిందితుడు తిరుమలరావు పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. అతడు బిసంకటక్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. దాడికి ఎందుకు పాల్పడ్డాడు అనే విషయం ఇంకా తెలియలేదు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed