రామడుగులో కిడ్నాప్ కలకలం.. చాకచక్యంగా పట్టుకున్న కుటుంబ సభ్యులు..

by Sumithra |
రామడుగులో కిడ్నాప్ కలకలం.. చాకచక్యంగా పట్టుకున్న కుటుంబ సభ్యులు..
X

దిశ, రామడుగు : రామడుగులో కిడ్నాప్ కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన వాన రాశి వెంకటేష్ చిన్న కుమారుడైన రాంప్రసాద్ (2) ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన గుర్తుతెలియని మహిళ వచ్చి కిడ్నాప్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరుగా విలపించారు.

బాబు కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల వారిని అడగగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వారి బాబును ఎవరో మహిళ వచ్చి ఎత్తుకొని ఆటోలో తీసుకెళ్తున్నదని తెలుపగా వెంటనే కుటుంబ సభ్యులు ఆటోను వెంటాడారు. అనంతరం ఆటోను గ్రామంలోని రైల్వే గేట్ వద్ద ఆపి మహిళను నిలదీశారు. దీంతో మహిళ ఎత్తికెళ్ళిన మాట నిజమేనని ఒప్పుకోవడంతో ఆ మహిళను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

Advertisement

Next Story