- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మహిళా నేతపై కీలకనేత లైంగికదాడి.. నిందితుడిపై నో యాక్షన్?
దిశ ప్రతినిధి, హైదరాబాద్: భార్య ఉండగానే మరో మహిళపై మోజుపడ్డాడు. పసుపుతాడు మెడలో కట్టి పెండ్లి అయిపోయిందన్నాడు. అనంతరం పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పూనుకున్నాడు. అంతేకాకుండా ఓ హోటల్‌కు పిలిపించి కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా నగ్న ఫోటోలు, వీడియోలు తీసి తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, లేని పక్షంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంతటి నీచానికి పాల్పడింది ఎవరో అనామకుడు కాదు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండి ఓ జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా పని చేసిన నాయకుడు. ఈ సంఘటనలో బాధితురాలు కూడా ఓ మాజీ ప్రజా ప్రతినిధి కావడం గమనార్హం. బాధిత మహిళ కథనం ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఓ ప్రజాప్రతినిధిగా పని చేశారు. గతేడాది మే నెలలో తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆరోపిస్తున్నది. దీంతో బాధిత మహిళ తనకు జరిగిన నష్టం మరో మహిళకు జరగవద్దని న్యాయపోరాటం చేస్తున్నది. అప్పట్లో మహిళా సంఘాలు సైతం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశాయి.
ఏం జరిగింది..
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా నేత గతంలో కీలక బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఓ మహిళా నాయకురాలికి గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ్ పేట్ జిల్లా బాధ్యతలను పార్టీ అప్పగించింది. దీంతో అక్కడికి వెళ్లిన ఆమె పార్టీ జిల్లా అధ్యక్షుడితో కలిసి ప్రచారం చేపట్టింది. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న అతడు ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసినట్లు బాధితురాలు చెబుతున్నది. అనంతరం దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ రోజు పీకల దాకా మద్యం సేవించి హోటల్ గదిలో తన కోరిక తీర్చాలని బలవంతపెట్టినట్లు పేర్కొంటున్నది. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడని ఆరోపిస్తున్నది. 2021 జూన్ 24న అతడు మరోసారి బాధితురాలిని ఓ హోటల్ గదికి తీసుకువెళ్లాడు.
హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు తాడును మెడలో కట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు వాపోతున్నది. అనంతరం బెంగుళూరుకు కూడా తీసుకువెళ్లినట్లు చెబుతున్నది. గతేడాది మే నెలలో బేగంపేటలోని ఓ హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడే యత్నం చేయగా అడ్డుకుంది. దీంతో ఆమెను మాటల్లో పెట్టి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తున్నది. నగ్న ఫోటోలు, వీడియోలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. ఆమె స్పృహలోకి వచ్చాక తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బ్లాక్ మెయిల్‌కు పాల్పడడడంతో మే 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసినా నేటి వరకు అరెస్ట్ చేయలేదు.
బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం, మహిళా సంఘాలు ధర్నా చేయడం, టీవీలు, పత్రికల్లో కథనాలు రావడంతో న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించాడు. కోర్టు తిరస్కరించడంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. దీంతో బాధితురాలు అతడి అరెస్ట్ కోసం పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. హోటల్ గదిలోకి ఆమె ఎంట్రీ కనబడడం లేదని చెబుతూ అరెస్ట్‌ను దాటవేస్తున్నారని ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై హెచ్ఆర్సీ, లోకాయుక్త, డీజీపీ, సీపీ, డీసీపీ, ఏసీపీలకు సైతం ఫిర్యాదు చేసింది.
ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణం..
నిందితుడి తండ్రి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నది. తాజాగా తన నగ్న వీడియోలు, ఫొటోలు తీసిన బేగంపేట హోటల్‌కు తాను వచ్చినట్లుగా సరైన ఆధారాలు లేవని పోలీసులు పేర్కొంటున్నట్లు వాపోతున్నది. కాగా తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని, రాష్ట్ర గవర్నర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరుతానని ఆమె వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : బర్త్‌డే పార్టీకని తీసుకెళ్లి.. మైనర్‌బాలికపై గ్యాంగ్‌రేప్..?