- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న ప్రకంపనలు
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: డ్రగ్స్‌కేసు నేపథ్యంలో టాలీవుడ్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు దర్యాప్తు అధికారులు కే.పీ.చౌదరిని జరిపిన విచారణలో బయటపడ్డ పేర్ల ఆధారంగా నోటీసులు ఇవ్వాలని భావిస్తుంటే ఎలాంటి విచారణకైనా మేం సిద్ధమంటూ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అరెస్టయిన చౌదరి ఫోన్లలో మా నెంబర్లు ఉన్నంత మాత్రానా మేం డ్రగ్స్తీసుకున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. తమ మొబైల్‌నెంబర్‌లను దర్యాప్తు అధికారులు పబ్లిక్చేయటాన్ని తప్పు పడుతున్నారు. అవసరమైతే దీనిపై కోర్టుకు కూడా వెళ్లటానికి సిద్ధమని చెబుతున్నారు. ఇక, ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ఈ కేసు కోర్టులో నిలబడదని పోలీసుశాఖకు చెందిన కొందరు సీనియర్అధికారులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు. డ్రగ్స్విక్రయాలు జరిపితేనే నేరమని వివరిస్తున్నారు.
రజనీకాంత్హీరోగా నటించిన కబాలీ సినిమా తెలుగు వర్షన్ నిర్మాత కే.పీ.చౌదరి ఇటీవల కిస్మత్‌పురా చౌరస్తా వద్ద కొకైన్అమ్ముతుండగా మాదాపూర్ఎస్వోటీ అధికారులు, రాజేంద్రనగర్పోలీసులతో కలిసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోర్టు అనుమతితో చౌదరిని కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు రెండు రోజులపాటు విచారణ జరిపారు. దీంట్లో బ్యాడ్మింటన్ప్లేయర్సిక్కిరెడ్డి, ఈ నగరానికి ఏమైంది సినిమా హీరో సుశాంత్‌రెడ్డి, ఆషూరెడ్డి, రఘుతేజ, సనామిశ్రా, నితినేశ్, భరత్, ప్రతాప్, జ్యోతిరెడ్డి, సురేఖావాణి, నవీన్‌రెడ్డితోపాటు మరికొందరితో చౌదరి వందల సంఖ్యలో ఫోన్లలో మాట్లాడినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని భావిస్తున్నట్టు తెలిపారు.
నెంబర్లు ఉంటే డ్రగ్స్ వాడినట్టేనా..?
ఈ క్రమంలో పోలీసుల ద్వారా పేర్లు వెల్లడైన సెలబ్రెటీలు పలువురు స్పందించారు. బ్యాడ్మింటన్ప్లేయర్సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇప్పటికీ దేశం తరఫున బ్యాడ్మింటన్ఆడుతోందన్నారు. ఈ క్రమంలో ఆమెకు తరచూ డోపింగ్పరీక్షలు జరుగుతుంటాయ్నారు. నిజంగా తన కూతురు డ్రగ్స్తీసుకుంటే ఆ విషయం ఎప్పుడో బయటపడేదన్నారు. చౌదరి పరిచయం ఉన్న నేపథ్యంలో పార్టీ చేసుకుంటానంటే తన ఫ్లాట్‌ను ఇచ్చిందని, పార్టీ జరిగిన సమయంలో సిక్కిరెడ్డి అసలు దేశంలోనే లేదని చెప్పారు. ప్రస్తుతం కూడా సిక్కిరెడ్డి డెన్మార్క్‌లో ఉందని తెలిపారు. ఇక, ఈ నగరానికి ఏమైంది అన్న సినిమాలో హీరోగా నటించిన సుశాంత్‌రెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణల మీద స్పందించారు. చౌదరి ఫోన్లిస్టులో పేరుంటే నేను డ్రగ్స్వాడుతున్నట్టా? అని ప్రశ్నించారు. ఎలాంటి పరీక్షకైనా తాను సిద్ధమన్నారు. ఆషూరెడ్డి సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తూ దర్యాప్తు అధికారులు తన వ్యక్తిగత మొబైల్‌నెంబర్‌ను బయటకు ఎలా లీక్చేస్తారని ప్రశ్నించారు. కొంతమందితో తనకున్న పరిచయాలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అవసరమైనపుడు ఈ అంశంపై స్పందిస్తానన్నారు.
అసలిది కేసేనా...?
ఇక, పోలీసుశాఖకు చెందిన సీనియర్అధికారి ఒకరు మాట్లాడుతూ అసలిది కేసేనా? అని వ్యాఖ్యానించారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఎవరైనా డ్రగ్స్సేవిస్తే వారిని బాధితులుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. వీరికి గుర్తింపు పొందిన రిహాబిలేషన్సెంటర్లలో చికిత్స అంద చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అనుమానితుల జాబితాలో ఉన్నవాళ్లంతా డ్రగ్స్సేవించినట్టుగా భావిస్తున్న వారే అని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి నోటీసులు ఎలా ఇస్తారు? ఇచ్చి ఏం విచారణ చేస్తారు? అని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు ఇంత హడావిడి చేయటానికి మరేవైనా కారణాలు ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు.