- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మో వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఆ ప్లాన్ తో లక్షల సొమ్ము కాజేశారు
దిశ, వెబ్ డెస్క్: ఉపాయం ఉంటే ఎంతటి అపాయన్నైనా తప్పించుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ సూక్తిని ఉత్తర ప్రదేశ్ కు చెందిన దొంగలు బాగా ఫాలో అయ్యారు. అయితే వాళ్లు ప్లాన్ చేసింది ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కాదు.. ఓ బంగారు దుఖానాన్ని కొల్లగొట్టటానికి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో ఓ పెద్ద నగల షాపు ఉంది. మంగళవారం ఉదయం షాపు ఓపెన్ చేసి లోపలకి వచ్చిన ఓనర్ అక్కడి దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నాడు. షాపులోని బంగారు నగలన్నింటినీ దొంగలెత్తుకెళ్లారు. అయితే వేసిన సెట్టర్ వేసినట్టే ఉంది.. నగలు మాత్రం మాయమయ్యాయనే సందేహంతో ఆ వ్యాపారి అటు ఇటు తిరుగుతూ షాపు లోపల అంతా పరిశీలించాడు. చివరికి దొంగతనం జరిగిన తీరు చూసి షాకయ్యాడు.
నగల షాపు పక్క నుంచి వెళ్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి షాపులోకి రావడానికి దొంగలు 10 అడుగుల సొరంగం తవ్యారు. ఆ సొరంగం గుండా రాత్రిపూట షాపులోకి ప్రవేశించి లక్షల రూపాయల విలువైన నగలన్నీ దోచుకెళ్లారు. జరిగింది తలచుకొదని లబోదిబోమన్న షాపు ఓనర్.. అనంతరం మీరట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నగరంలోని బంగారు వ్యాపారులు పోలీసులను షాపులోకి రానీయకుండా అడ్డుకున్నారు. బంగారు నగల అపహరణకు సంబంధించి నగరంలో ఇది నాలుగో కేసు అని, పోలీసులు సరిగ్గా పట్టించుకుంటే ఈ ఘటన జరిగేది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చాక వాళ్లను లోపలకి అనుమతించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు.