- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ దొంగలను నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న దంపతులు
దిశ, వెబ్ డెస్క్: పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సైబర్ దొంగలు మాత్రం కొత్త కొత్త రూట్లను వెతుక్కుంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. వారిని నమ్మించి లక్షల కొద్దీ డబ్బును దోచేస్తున్నారు. తాజాగా గుజరాత్ కు చెందిన ఓ దంపతులు సైబర్ దొంగలను నమ్మి కోటి రూపాయలకు పైగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ‘‘ మీరు హాయిగా ఇంట్లో కూర్చొని రోజుకు 2,500 నుంచి 5,000 వరకు సంపాదించవచ్చు. అయితే మీరు చేయాల్సిందల్లా సినిమాలు చూడటం.. వాటికి రేటింగ్ ఇవ్వడం’’ అంటూ టెలిగ్రామ్ లో వచ్చిన ఓ మెసేజ్ ను చూసిన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ కు చెందిన దంపతులు ఎగిరిగంతేశారు. ఈ క్రమంలోనే సైబర్ దొంగలు చెప్పనట్లు ఓ ఫేక్ వైబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని పాస్ వర్డ్ జనరేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ దంపతులను ఓ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు సైబర్ దొంగలు. రేటింగ్ మొదలు పెట్టాలంటే మూవీ టికెట్లు కొనాలని చెప్పారు. అందుకోసం మొదటగా ఆ దంపతుల చేత హాలీవుడ్, బాలీవుడ్ కు సంబంధించి 28 సినిమాల టికెట్లు కొనిపించారు. అనంతరం ఈ సినిమాలను చూసి రేటింగ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ దంపతులను నమ్మించడానికి సైబర్ నేరగాళ్లు భార్య అకౌంట్ లో లక్ష రూపాయలు డిపాజిట్ చేశారు. 10 వేల రూపాయల గిఫ్ట్ కూపన్ కూడా పంపారు. దీంతో వారిని నమ్మిన ఆ దంపతులు సినిమాలు చూడగా రూ.5 లక్షల వరకు ఎర్నింగ్స్ వచ్చాయి. అయితే వాటిని విత్ డ్రా చేసుకుందామని ఆ దంపతులు ప్రయత్నించగా మరిన్ని టికెట్లు కొని చూడాలని సైబర్ దొంగలు చెప్పారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఆ అమాయక దంపతులు సినిమాల మీద సినిమాలు కొంటూ రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారు.
ఈ క్రమంలోనే ఈ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి వారు ప్రయత్నించగా పెద్ద మొత్తంలో డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే సర్ ఛార్జి చెల్లించాలని దుండగులు చెప్పగా వారు అదే పని చేశారు. ఈ రకంగా మొత్తం రూ.70 లక్షలు ఖర్చుపెట్టారు. ఇక ఈ అమౌంట్ నైనా తీసుకుందామనుకున్న ఆ దంపతులను ‘‘మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. మనీ లాండరింగ్ కేసు పెడుతాం’’ అంటూ దుండగులు బెదిరించారు. ఈ క్రమంలోనే వాళ్లకు భయపడ్డ ఆ దంపతులు వారు చెప్పినట్లు మొత్తం డబ్బు విత్ డ్రా చేసుకోవడం కోసం మరో స్కీంలో చేరారు. ఈ రకంగా మొత్తం కోటి పన్నెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సైబర్ దొంగల చేతిలో మోసపోయిన ఈ దంపతులు ఉన్నత విద్యావంతులు కావడం విశేషం.