హైదరాబాద్ రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ అరెస్ట్

by Gantepaka Srikanth |
హైదరాబాద్ రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్(Gangster) అయూబ్‌ ఖాన్‌(Ayub Khan)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో వచ్చి బుధవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయూబ్ ఖాన్‌పై దోపిడీ కేసులు, భూకబ్జా కేసులు ఉన్నాయి. మొత్తం 14కు పైగా హత్యాయత్నం కేసులు సైతం ఉన్నాయి. గతంలో హైదరాబాద్ పాతబస్తీలో ఆస్తి వివాదంలో మహిళను బెదిరించినందుకు గాను అయూబ్‌ఖాన్ సహా అతని సహచరులపై హుస్సేనియాలం పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే ఆమెను, ఆమె కొడుకులను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ బెదిరించడం అప్పట్లో కలకలం రేపింది. అంతేకాదు.. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో అయూబ్ ఖాన్ జైలు జీవితం కూడా గడిపాడు.




Advertisement

Next Story