HYD HCU : థాయ్‌లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడి యత్నం

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-03 06:57:18.0  )
HYD HCU : థాయ్‌లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడి యత్నం
X

దిశ, శేరిలింగంపల్లి: విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఆచార్యులే విద్యార్థులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ నీచానికి ఒడిగట్టాడు. థాయిలాండ్ నుండి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థినిపై గతరాత్రి హిందీ బోధించే ప్రొఫెసర్ రవీరంజన్ లైంగికదాడికి తెగబడ్డాడు. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థినిని హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ ప్రొఫెసర్ రవి రంజన్ తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు.

ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించి అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. భాదిత యువతి ప్రతిఘటించడంతో ఆమెను కొట్టిన రవి రంజన్ తిరిగి బాధిత యువతిని స్వయంగా కారులో తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుండి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ 354 కింద కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్‌పై మూడు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.

గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదంటున్నారు విద్యార్థులు. అలాగే బాధితురాలు థాయిలాండ్ ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే గత నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్‌పై ప్రొఫెసర్ రవి రంజన్ ఉపన్యాసం ఇవ్వడం విశేషం. మహిళా సాధికారత మీద ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థినిల మీద లైంగిక దాడికి పాల్పడడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

Read More.......

మద్యానికి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు అరెస్ట్​

Advertisement

Next Story