- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం.. మద్యం మత్తులో భార్య, కుమార్తెను హత్య చేసిన భర్త
దిశ, డైనమిక్ బ్యూరో: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో సోమవారం అర్ధరాత్రి భార్య, కూతురిని కొడవలితో నరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధరరెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి(37), కుమార్తె గంగోత్రి (14)లను గొంతులు కోశాడు. మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు. శ్రీలక్ష్మి అంగన్వాడి కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తుంది. కుమార్తె గంగోత్రి ఎనిమిదో తరగతి చదువుతుంది. భర్త గంగాధర్కు మతిస్థిమితం లేదు, ఎప్పుడు మద్యం తాగుతూ ఉంటాడు. సోమవారం రాత్రి భార్య, కుమార్తె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో వారిపై దాడి చేసి హత్య చేశాడు. మంగళవారం శ్రీలక్ష్మి వీధిలోకి రాకపోవడంతో అంగన్వాడీ కార్యకర్త ఫోన్ ద్వారా ప్రయత్నించారు. సమయంలో భర్త గంగాధర్ రెడ్డి ఫోన్ ఎత్తి నా భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.