సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

by GSrikanth |   ( Updated:2022-09-13 05:29:45.0  )
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రూబీ లాడ్జి కింద ఉన్న ఎలక్ట్రిక్ బైక్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మొత్తం ఏడుగురు టూరిస్టులు సజీవదహనం అయ్యారు. పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జికి మంటలు వ్యాపించడంతో ఒకటి, రెండు ఫ్లోర్లలో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 24 మంది ఉన్నారని, వీరిలో ఉత్తరాది వాళ్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక, ఈ ప్రమాదంలో ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా దగ్ధమయినట్లు సమాచారం. ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో బైకులు పేలడంతో లాడ్జిలో ఉన్న టూరిస్టులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

Also Read : సికింద్రాబాద్ ప్రమాదంపై DCP చందనా దీప్తి కీలక వ్యాఖ్యలు

Also Read : సికింద్రాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Also Read : సికింద్రాబాద్ ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్.. "వారి మృతికి ప్రభుత్వమే కారణం"


Advertisement

Next Story

Most Viewed