సినిమా రేంజ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్.. మహిళ కడుపులో 14 కోట్ల విలువచేసే డ్రగ్స్

by Mahesh |   ( Updated:2024-12-18 03:48:52.0  )
సినిమా రేంజ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్.. మహిళ కడుపులో 14 కోట్ల విలువచేసే డ్రగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో భారత్ లోని పలు కీలక నగరాల్లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడంతో.. యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో భారత్ లోని పలు కీలక నగరాల్లో ఈ డ్రగ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో విదేశాల నుంచి భారత్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. దీనికి అరికట్టేందుకు విమానాశ్రయాల్లో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నవారు ఎయిర్ పోర్టు పోలీసులు, అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కూడా చెన్నై ఎయిర్ పోర్టులో బుధవారం తెల్లవారు జామున భారీగా డ్రగ్స్ పట్టుబడింది.కాగా ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం మొత్తం విడోక్కడే సినిమాను తలపించేలా కనిపించింది.

వివరాల్లోకి వెలితే.. కెన్యా నుంచి భారత్ వచ్చిన ఓ మహిళ.. తన కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను దాచిపెట్టింది. రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగా.. తనిఖీలు నిర్వహిస్తుండగా మహిళ ప్రవర్తన తేడా ఉండటంతో ఆమెను స్కానింగ్ చేశారు. దీంతో ఆమె పొట్టలో ఎవో వస్తువులు దాచి పెట్టినట్లు గమనించిన అధికారులు.. డాక్టర్ల సాయంతో వాటిని బయటకు తీసి.. చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మహిళ కడుపులో దాదాపు 76 డ్రగ్స్ క్యాప్సూల్స్ ఉండగా.. వాటి విలువ దాదాపు 14.5 కోట్ల విలువ ఉంటుందని అధికారులు గుర్తించారు. కాగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినందుకు గాను సదరు కెన్యా మహిళపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed