- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..
దిశ, తాండూర్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. పూదరి రాజయ్య ఇల్లు పూర్తిగా దగ్దం అయింది. గ్రామస్తులు నీళ్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రప్రయత్నాలు చేసినప్పటికి ఇంట్లో నిల్వ ఉంచిన పత్తికి మంటలు వ్యాపించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 80 క్వింటాల్ పత్తి, 12 తులాల బంగారం, వెండి ఆభరణాలు, రూ. 5 లక్షల నగదు, ఫ్రిడ్జ్, టీవీ, తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదంలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా అర్పివేశారు. స్థానిక తహశీల్దార్ మల్లికార్జున్ బాధిత కుటుంబీకులు పరామర్శించి, ఘటన, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే ఆత్రం సక్కు
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు భరోసా కల్పించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి చేరుకుని అగ్నికి దగ్దమైన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్ సోమశేఖర్, నాయకులు విమలేష్, మహేష్ గౌడ్, శ్రీనివాస్, సంజీవ్ సుదర్శన్ గౌడ్, సంజీవ్ జైశ్వాల్ తదితరులు ఉన్నారు.