హైదరాబాద్‌‌లో దారుణ ఘటన.. బాత్‌రూమ్‌కి వెళ్లిన బాలిక వీడియోలు తీసిన వ్యక్తులు

by Hamsa |   ( Updated:2023-03-11 05:05:32.0  )
హైదరాబాద్‌‌లో దారుణ ఘటన.. బాత్‌రూమ్‌కి వెళ్లిన బాలిక వీడియోలు తీసిన వ్యక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో అమ్మాయిలు ఎక్కడ కనిపించినా కొంత మంది పోకిరీలు వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా,హైదరాబాద్‌లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మీర్‌పేట్ టీచర్స్ కాలనీలో భారత విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూం కి వెళ్ళింది. అయితే అక్కడ పక్కనే పనిచేస్తున్న కొంత మంది వ్యక్తులు బాలికను వీడియోలు తీశారు. అది గమనించిన బాలిక ఇంటికి చేరుకుని గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. దీంతో బాలిక ఏడుపు విని తల్లిదండ్రులు ఆమెను అడిగి జరిగిన సంఘటన తెలుసుకున్నారు. జరిగిన విషయం బాలిక చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు న్యాయం కోపం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed