ఖమ్మంలో దారుణం.. టెన్త్ విద్యార్థినిపై Headmaster ఘోరం

by GSrikanth |   ( Updated:2022-08-22 06:16:34.0  )
ఖమ్మంలో దారుణం.. టెన్త్ విద్యార్థినిపై Headmaster ఘోరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల సిరిపురం హైస్కూల్ హెడ్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. విషయం తెలిసిన గ్రామస్తులు హెడ్ మాస్టర్‌పై ఆగ్రహంతో కారులో వెళుతున్న ఆయన్ను బయటకు లాగి చితకబాదారు. వారి నుంచి తప్పించుకున్న హెడ్ మాస్టర్.. ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌ ఇంట్లో తలదాక్కునట్లు తెలుస్తోంది. దీంతో హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కారు ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story