- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
by Shiva |

X
దిశ, నిజామాబాద్ క్రైం : మద్యానికి బానిసైన ఓ యువకుడికి జీవితంపై వీరక్తి కలిగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ కాలనీకి చెందిన రావుల మహేందర్ (37) సెల్స్ మెన్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా మహేందర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడికి జీవితంపై వీరక్తి కలిగి సోమవారం అర్థరాత్రి సమయంలో తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
Next Story