- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శుభకార్యానికి వెళ్లి వస్తూ పరలోకానికి
by Sridhar Babu |

X
దిశ, ఉట్నూర్ : శుభకార్యానికి వెళ్లి వస్తూ మంగళవారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జైనూర్ మండలానికి చెందిన భక్కు(46) బైక్పై ఉట్నూర్ మండలంలోని దంతాన్ పల్లి గ్రామ సమీపంలో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో మారుతీగూడ గ్రామ సమీపంలో ఎదురెదురుగా బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బక్కు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 కు సమాచారం అందించడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story