- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్ కి వెళ్లి వస్తానని వెళ్లి అదృశ్యం
దిశ, శామీర్ పేట : మతిస్థిమితం లేని వ్యక్తి అదృష్టమైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి గ్రామానికి చెందిన తిరుపతి (37) వృత్తిరీత్యా డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరి మధ్యలో గొడవలు అవుతుండడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఈనెల 4వ తేదీన తిరుపతి ఉప్పరపల్లి గ్రామంలో ఉండే అతని అన్న అబ్దుల్లా ఇంటికి వచ్చాడు.
అతనికి మతిస్థిమితం లేకపోవడంతో నగరంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వైద్యులు రెండు రోజుల తర్వాత తీసుకురమ్మని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం మార్కెట్ కి వెళ్లి వస్తానని తిరుపతి ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.